Cancer Club


Welcome
To
CITIZEN FORCE
CANCER CLUB


సిటిజన్ ఫోర్స్ క్యాన్సర్ చికిత్సకు ఆర్థిక సహాయ కార్యక్రమం

ఒక్కరి కోసం అందరూ - అందరి కోసం ఒక్కరు

భారతదేశంలో చాలా మంది క్యాన్సర్ పేషేంట్స్ చికిత్స ఖర్చును భరించలేక ఇబ్బంది పడటమే కాకుండా, మరణిస్తున్నారు. వారే కాకుండా వారి కుటుంబ సభ్యులు కూడా ఆర్ధికంగా, మానసికంగా అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ సమస్యను, ఎంతో కొంత, పరిష్కరించడానికి, సిటిజన్ ఫోర్స్ క్యాన్సర్ ట్రీట్మెంట్ ఫైనాన్షియల్ ఎయిడ్ ప్రోగ్రామ్ ద్వారా భారతదేశం అంతటా అర్హత కలిగిన క్యాన్సర్ పేషేంట్స్ కు ఆర్థిక సహాయం అందించుటకు చొరవ తీసుకుంటున్నది. కమ్యూనిటీ హెల్త్ ప్రమోషన్ ప్రాజెక్ట్‌లో భాగంగా "ఒక్కరి కోసం అందరూ - అందరి కోసం ఒక్కరు" అనే నినాదాన్ని అమలుపరుస్తూ, వేలాది మంది క్యాన్సర్ పేషేంట్స్ మరియూ వారి కుటుంబాలకు ఆసరాగా వుండాలని సిటిజన్ ఫోర్స్ లక్ష్యంగా పెట్టుకుంది.


అర్హత మరియు ఎంత వరకు సహాయం అందవచ్చు వంటి విషయాల గురించి ఈ క్రింద క్లుప్తముగా చెప్పడానికి ప్రయత్నిస్తున్నాము. మరిన్ని వివరాలు సిటిజెన్ ఫోర్స్ కాన్సర్ క్లబ్ App లో ఎప్పటికప్పుడు అప్డేట్ చేయబడుతుంది.


చికిత్స ఖర్చు :

  1. ఆర్థిక సహాయం: రూ. 15 లక్షల వరకు (బోన్ మారో ట్రాన్స్‌ప్లాంట్‌కు రూ. 20 లక్షల వరకు).
  2. చికిత్స ప్రోటోకాల్: కీమోథెరపీ, రేడియేషన్, సర్జరీ, సపోర్టివ్ కేర్ మరియు ప్రొస్థెసిస్‌ చికిత్సలు కవర్ అవుతాయి.
  3. చికిత్సకు ఎంత ఖర్చు: సిటిజన్ ఫోర్స్ ప్యానెల్‌లోని స్పెషలిస్ట్ డాక్టర్లచే చికిత్సకు ఎంత ఖర్చు అవసరం అవుతుందో ఆమోదించబడతుంది.

ఈ ప్రోగ్రాం ప్రయోజనాలు:

  1. క్యాన్సర్ చికిత్సకు ఆర్థిక సహాయం: అర్హత కలిగిన క్యాన్సర్ పేషేంట్స్ కు చికిత్స కోసం సిటిజెన్ ఫోర్స్ App ద్వారా ఆర్థిక సహాయం అందిచడంలో తోడ్పాటు.
  2. దేశవ్యాప్త అమలు: ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా అమలు చేయబడుతుంది.
  3. క్యాన్సర్ మరియు అరుదైన వ్యాధులకు ప్రాధాన్యత: మొదటిగా, ఈ కార్యక్రమంలో క్యాన్సర్ మరియు అరుదైన వ్యాధులపై దృష్టి పెట్టబడుతుంది, వనరుల లభ్యతను బట్టి ఇతర వ్యాధులను ఈ కార్యక్రమంలో చేర్చుటకు కాలక్రమేణా పరిశీలన జరుగును.

లక్ష్యం:

ఈ కార్యక్రమానికి మార్గనిర్దేశం "ఒక్కరి కోసం అందరు - అందరి కోసం ఒక్కరు" అనే నినాదం. ఆపదలో మరియు అవసరంలో వున్నవారికి సమిష్టిగా మద్దతును తెలియజేయడం ఈ నినాదం యొక్క లక్ష్యం.



అర్హత ప్రమాణాలు:

  1. కుటుంబ ఆదాయం: సగటు కుటుంబ ఆదాయం నెలకు ఒక లక్ష రూపాయలు మించకూడదు (అయితే, ఈ పరిమితిని కేసు మరియు పరిస్థితుల ఆధారంగా సడలించవచ్చు).
  2. రిజిస్టర్డ్ ఆసుపత్రులలో చికిత్స: పేషేంట్స్ సిటిజన్ ఫోర్స్ చే గుర్తింపబడిన [empanelled hospitals] ఆసుపత్రులలో చికిత్స పొందాలి.
  3. బీమా మరియు ప్రభుత్వ ప్రయోజనాలు: పేషేంట్స్ ముందుగా అందుబాటులో ఉన్న అన్ని బీమా మరియు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను ఉపయోగించుకోవాలి.
  4. పౌరసత్వం మరియు నమోదు: పేషేంట్స్ భారతీయ పౌరులు అయి ఉండాలి. రోగ నిర్ధారణకు కనీసం ఒక సంవత్సరం ముందు సిటిజన్ ఫోర్స్ క్యాన్సర్ క్లబ్‌లో నమోదు అయి ఉండాలి.
  5. సమాజ భాగస్వామ్యం: రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు యాక్టివ్ స్థితిలో ఉండాలి అంటే, సిటిజన్ ఫోర్స్ లేదా దాని అనుబంధ సంస్థలు నిర్వహించే కమ్యూనిటీ ప్రయోజన కార్యక్రమాలు, వైద్య సహాయ కార్యక్రమాలు మరియు ప్రజా ప్రయోజన కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనడం ద్వారా "ఒక్కరి కోసం అందరు - అందరి కోసం ఒక్కరు" అనే అనే లక్ష్యాన్ని బలపరుస్తూ ఉండాలి.

పిల్లల విద్య మరియు ఇతర అవసరాలు:

నిరుపేద పేషేంట్స్ మరణిస్తే, అటువంటి కుటుంబాల్లో డిగ్రీ లేదా ఇతర టెక్నికల్ కోర్సులు చదివే పిల్లలు ఉండి, పేదరికం వలన మిగతా విద్యాకాలం పూర్తి చేయడానికి ప్రభుత్వాల నుండి ఫీజు రీయింబర్స్‌మెంట్ పొందలేని లేదా మరి ఏ ఇతర కారణాల వలన గాని ట్యూషన్ ఫీజు చెల్లించడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లయితే, వారు చదువుతున్న కోర్సు పూర్తి అయ్యేవరకూ చేయూత నిచ్చే దాతలను గుర్తించడానికి సిటిజన్ ఫోర్స్ అన్ని ప్రయత్నాలు చేస్తుంది.


ఆడ పిల్లలకు రక్షణ: దీర్ఘకాలం మందులు వాడిన తర్వాత లేదా చికిత్స పొందినా కూడా ఉపయోగం లేకుండా, తద్వారా పేదరికంలోకి జారుకున్న పేషేంట్స్ మరణించిన సందర్భంలో, వారి కుటుంబంలో ఆడ పిల్లలు ఉన్నట్లయితే, వారు కనీసం డిగ్రీ స్థాయి వరకు చదువుకుని, జీవితములో స్థిరపడటానికి సాధ్యమయ్యే మార్గాలను అంటే వారి విద్య మరియు వివాహ అవసరాలను ఆదుకుని చేయూత నిచ్చే దాతలను గుర్తించడానికి సిటిజన్ ఫోర్స్ అన్ని ప్రయత్నాలు చేస్తుంది.


చదువుకుంటూ సంపాదన:

ప్లస్ 2 తర్వాత, పిల్లలు చదువుకుంటానే తమ ఖర్చులకోసం సంపాదించడానికి తగిన శిక్షణ పొందుతారు.


బాల బాలికల ప్రోగ్రామ్ లక్ష్యం:

ఏ దిక్కు లేని బాల బాలికల కు మద్దతు ఇవ్వడం, పేదరికం, ప్రేమ లేకపోవడం మరియు తగినంత పర్యవేక్షణ లేకపోవడం వల్ల వారిలో తలెత్తే సామాజిక వ్యతిరేక ప్రవర్తన వలన సమాజానికి కలిగే ప్రమాదాన్ని తగ్గించడంతో పాటు వారికి అవసరమైన సంరక్షణ మరియు మద్దతు లభించేలా చూడటం ఈ కార్యక్రమం యొక్క లక్ష్యం.


Updates and Changes:

App Updates: The modification/changes will be updated on the Citizen Force Cancer Club App from time to time.

Rule Changes: Eligibility criteria and rules are subject to change, and registrants are advised to periodically review the information on the app.

[మారుతున్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎప్పటికప్పుడు సిటిజెన్ ఫోర్స్ App లో అప్ డేట్ చేయబడతాయి. కనుక సిటిజెన్ ఫోర్స్ App ను రెగ్యులర్ గా గమనించండి.]